Rahul Gandhi: రాహుల్‌ను కలిసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
Rahul Gandhi: రాహుల్‌ను కలిసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ * పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభం నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత
రాహుల్ గాంధీని కలసిన ప్రశాంత్ కిషోర్ (ఫోటో ది హన్స్ ఇండియా)
Rahul Gandhi: పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక మలుపు చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత రాహుల్‌ను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశారు. గతకొంత కాలంగా పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభం ఏర్పడింది. అమరీందర్ సింగ్, సిద్ధు మధ్య పొలిటికల్ చిచ్చు రేగింది. ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో పంజాబ్ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారిపోయాయి. ఇదే సమయంలో కరెంట్ కోతలు సహా పలు అంశాలపై ఆందోళనలు సెగలు రేపాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్, రాహుల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది. ఇదే సమావేశంలో మరో ముగ్గురు పంజాబ్ కాంగ్రెస్ ప్యానెల్ సభ్యులు కూడా పాల్గొనడం ఉత్కంఠ రేపుతోంది.