West Bengal: బెంగాల్‌లో మొదలైన ఎన్నికల హడావుడి

West Bengal: ఉప ఎన్నికలకు భవానీపూర్‌ నుంచి రంగంలోకి మమతాబెనర్జీ * నామినేషన్ దాఖలు చేసిన దీదీ

Update: 2021-09-10 10:30 GMT

మమతా బెనర్జీ - ప్రియాంక 

West Bengal: పశ్చిమబెంగాల్ ఉప ఎన్నికల్లో రసవత్తర పోరుకు తెరలేచింది. భవానీపూర్‌ ఉప ఎన్నికల్లో టీఎంసీ అధినేత, సీఎం మమతా బెనర్జీ పై బీజేపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. మరోవైపు ఇవాళ భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి దీదీ నామినేషన్ దాఖలు చేశారు ముఖ్య అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 30న పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు.

మరోవైపు భవానీపూర్ ఉపఎన్నిక పోరులో బీజేపీ న్యాయవాది ప్రియాంక టిబ్రేవాల్‌ను బరిలోకి దింపింది. ప్రియాంక టిబ్రేవాల్ ప్రస్తుతం బెంగాల్ బీజేవైఎం ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. న్యాయశాస్త్రంలో పట్టాపొందిన ఆమెను దీదీకి పోటీగా దింపింది బీజేపీ.ఈ ఏడాది ప్రారంభంలో పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సందర్భంగా తృణమూల్ నుంచి బీజేపీలోకి వెళ్లి బరిలోకి దిగిన సువేందు అధికారిని ఓడించడమే లక్ష్యంగా దీదీ నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో దీదీ కేవలం 19 వందల ఓట్ల తేడాతో ఓడిపోయింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం మెజారిటీ స్థానాలు సాధించి వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది.

Tags:    

Similar News