హాట్స్ ఆఫ్: 8 నెలల గర్భిణీ అయినప్పటికీ.. అసెంబ్లీ సమావేశాలకి..

నాయకుడు అంటే ప్రజల సమస్యలపై పోరాడేవాడు.. అందుకే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి మరి గెలిపించేది. కానీ ఓట్లకు ముందు ఒకలాగా, గెలిచాకా మరోలాగా వ్యవహరించే ప్రజాప్రతినిధులు మన దేశంలో చాలానే మంది ఉన్నారు.

Update: 2020-02-29 13:29 GMT
MLA Namita Mundada (File Photo)

నాయకుడు అంటే ప్రజల సమస్యలపై పోరాడేవాడు.. అందుకే ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి మరి గెలిపించేది. కానీ ఓట్లకు ముందు ఒకలాగా, గెలిచాకా మరోలాగా వ్యవహరించే ప్రజాప్రతినిధులు మన దేశంలో చాలానే మంది ఉన్నారు. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలలో ప్రజల సమస్యలపై మాట్లాడకుండా గురకపోట్టి నిద్రపోయే వారు కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ సమావేశాలని లైట్ తీసుకొని ఎగొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఓ మహిళ ఎమ్మెల్యే, అందులోనూ ఎనమిది నెలల గర్భిణి అయినప్పటికీ తన భాద్యతను గుర్తుపెట్టుకొని మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది.

ఆమె పేరు నమితా ముందాడ.. వయసు 30 సంవత్సరాలు.. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో చేరి బీడ్ అనే నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందింది. నమితా ముందాడ వివాహం అయ్యాక మొదటిసారి గర్భం దాల్చారు. అయితే తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఎనమిది నెలల గర్భిణి అయినప్పటికీ ఆమె బడ్జెట్ సమావేశాలకి హాజరై అందరిని ఆశ్చర్యపరిచారు. ఎనమిది నెలల గర్భిని అయి ఉండి ఇంట్లో విశ్రాంతి తీసుకోక, ఎందుకు బడ్జెట్ సమావేశాలకి హాజరయ్యారని, వీటివలన మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి కదా అని మీడియా ప్రశ్నించింది.

అయితే దీనిపైన ఆమె మాట్లడుతూ.. ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకువెళ్లేందుకే అసెంబ్లీ సమావేశానికి వచ్చానని, అది నా భాద్యత అని నమితా ముందాడ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వైద్యుల పర్యవేక్షణలోనే ఇక్కడికి వచ్చానని ఆమె వెల్లడించింది. అయితే తొలి గర్భిణీ అయి ఉండి, అసెంబ్లీ సమావేశాలకు హాజరైన మొదటి ఎమ్మెల్యే మీరేనని నెటిజన్లు అభిప్రాయపడుతూ శభాష్ అని కొనియాడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ప్రతి ఒక్క నియోజవర్గానికి ఉండాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



Tags:    

Similar News