కర్ణాటకలో నేటి నుంచి 3రోజులపాటు విద్యాసంస్థలు మూసివేత

Karnataka: హిజాబ్‌ వివాదంతో కర్ణాటక సీఎం బొమ్మై కీలక నిర్ణయం. నేడు హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో విచారణ.

Update: 2022-02-09 03:34 GMT

కర్ణాటకలో నేటి నుంచి 3రోజులపాటు విద్యాసంస్థలు మూసివేత

Karnataka: కన్నడ నాట హిజాబ్‌ వివాదం తీవ్ర రూపం దాల్చింది. హిజాబ్‌, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కాలేజీలకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అంతేకాదు.. పలు జిల్లాల్లోని కళాశాలల వద్ద ఇరు వర్గాలకు చెందిన విద్యార్థులు ఆందోళనలకు దిగారు. పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి కూడా చేశారు. మొత్తానికి ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.

హిజాబ్‌ను వ్యతిరేకించే క్రమంలో కొందరు విద్యార్థులు జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు ప్రత్యేకించిన స్తంభంపై కాషాయ జెండాను ఎగురవేశారు. ఇలాంటి సమయంలోనే న్యాయస్థానం తీర్పు వెల్లడించేంత వరకు సహనంతో ఉండాలని ఆరాష్ట్ర సీఎం బసవరాజ బొమ్మై విజ్ఞప్తి చేశారు. అటు హిజాబ్‌ వివాదంపై విద్యార్థినులు దాఖలు చేసిన పిటీషన్‌పై నిన్న ధర్మాసనం విచారించింది. కేరళ, తమిళనాడులో హిజాబ్‌ వస్త్రధారణలపై ఆయా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా పరిశీలించింది. కాగా.. ఇదే అంశంపై కర్ణాటక హైకోర్టు నేడు మరోసారి విచారణ చేపట్టనుంది.

Tags:    

Similar News