Betting App Case: యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, సోనూసూద్‌కి ఈడీ నోటీసులు
Betting App Case: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది.
Betting App Case: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురికి సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా మరో ముగ్గురు సెలబ్రిటీలకు సమన్లు ఇచ్చింది. భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పతో పాటు సినీ నటుడు సోనూసూద్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ వన్ ఎక్స్ బెట్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఉతప్పకు సమన్లు జారీ చేసిన ఈడీ..ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23న యువరాజ్‌ను, ఈనెల 24న సోనూసూద్‌ను విచారణకు రావాలని పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు మాజీ క్రికెటర్లకు సమన్లు అందాయి. ఇప్పటికే మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనాను ఈడీ విచారించింది.