Luxury Car Smuggling Case: నటులు దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో ఈడీ దాడులు
లగ్జరీ కార్ల స్మగ్లింగ్, అక్రమ విదేశీ మారక ద్రవ్య నెట్‌వర్క్‌పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా కేరళ, తమిళనాడులోని 17 ప్రదేశాలలో ఈడీ దాడులు నిర్వహించింది.
Luxury Car Smuggling Case: నటులు దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాల్లో ఈడీ దాడులు
లగ్జరీ కార్ల స్మగ్లింగ్, అక్రమ విదేశీ మారక ద్రవ్య నెట్‌వర్క్‌పై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా కేరళ, తమిళనాడులోని 17 ప్రదేశాలలో ఈడీ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో సినీ నటులు పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్, అమిత్ చక్కలక్కల్ నివాసాలు, అలాగే ఎర్నాకుళం, త్రిస్సూర్, కోజికోడ్, మలప్పురం, కొట్టాయం, కోయంబత్తూరులోని కొంతమంది వాహన యజమానులు, ఆటో వర్క్‌షాప్‌లు, వ్యాపారులకు సంబంధించిన స్థలాలు ఉన్నాయి.
మా కింద చేపట్టిన ఈ చర్య, భూటాన్ నుంచి భారత్‌కి హై-ఎండ్ వాహనాల అక్రమ రవాణాపై.. ఇటీవలి కస్టమ్స్ దర్యాప్తు తర్వాత జరిగింది. ఇండో-భూటాన్, నేపాల్ మార్గాల ద్వారా ల్యాండ్ క్రూయిజర్, డిఫెండర్, మసెరటి వంటి లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకోవడంలో ఒక సిండికేట్ ఉందని నిఘా సమాచారం వెల్లడించింది.