తమిళనాడులో ఈడీ రైడ్స్‌.. విద్యాశాఖ మంత్రి పొన్ముడి ఇంటిపై దాడులు

ED Raids: పొన్ముడి బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ జరుగుతున్న సోదాలు

Update: 2023-07-17 05:32 GMT

తమిళనాడులో ఈడీ రైడ్స్‌.. విద్యాశాఖ మంత్రి పొన్ముడి ఇంటిపై దాడులు

ED Raids: తమిళనాడులో ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇటీవల సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన ఈడీ అధికారులు.. తాజాగా మంత్రి పొన్ముడి ఆయన కుమారుడి ఇళ్లపై ఈ ఉదయం దాడులు చేశారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి అయిన పొన్ముడిపై మనీ లాండరింగ్‌ ఆరోపణలు నేపథ్యంలో సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పొన్ముడి ఇంటితో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు చేపట్టారు. మొత్తం 9 చోట్ల ఈడీ అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది.

2007 నుంచి 2011 వరకు పొన్ముడి గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో గనుల లైసెన్స్‌లకు నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఆయన తనయుడు గౌతమ్‌ సహ నిందితుడిగా ఉన్నాడు. అవినీతి ఆరోపణల కేసులో ఊరట కోసం పొన్ముడి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణపై స్టే విధించాలని కోరారు. అయితే కోర్టులో ఆయనకు ఉపశమనం దక్కలేదు.

Tags:    

Similar News