యోగి ఆదిత్యనాథ్, మాయావతిలపై ఈసీ నిషేధం

Update: 2019-04-16 02:54 GMT

ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందున ఉత్తరప్రదేశ్ సీఎం యోగి, మాజీ సీఎం మాయవతిలపై చర్యలకు ఉపక్రమించింది ఈసీ. వారి ప్రసంగాల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గాను మాయావతి ప్రచారంపై 48 గంటలు, అలాగే యోగి ఆదిత్యానాథ్ ప్రచారం పై 72 గంటల నిషేదం విధించింది ఈసీ.

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో నేతలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నా… ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా మాయావతి, యోగి ఆధిత్యనాథ్ వ్యాఖ్యలను ప్రస్తావించింది సుప్రీం కోర్టు. నాయ్యస్థానం ఆదేశాలపై స్పందించిన ఈసీ యోగి ఆదిత్యనాథ్, మాయావతిల ప్రచారంపై తాత్కలిక నిషేదం విధించింది. 

Similar News