దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ

బిహార్‌లో నిర్వహించిన మాదిరిగానే.. దేశవ్యాప్తంగా S.I.Rకు సిద్ధమైన కేంద్ర ఎన్నికల సంఘం..వివరాలను వెల్లడించనుంది.

Update: 2025-10-27 05:51 GMT

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ

బిహార్‌లో నిర్వహించిన మాదిరిగానే.. దేశవ్యాప్తంగా S.I.Rకు సిద్ధమైన కేంద్ర ఎన్నికల సంఘం..వివరాలను వెల్లడించనుంది. ఈ మేరకు నేడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. దశలవారీగా దేశవ్యాప్తంగా S.I.R నిర్వహించనున్న ఈసీ... తొలి విడతలో చేపట్టే రాష్ట్రాల పేర్లు వెల్లడించే అవకాశముంది.

ఇందుకు సంబంధించిన కీలక ప్రకటనను ఈసీ నేడు సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు ఓ సమావేశంలో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు 15 రాష్ట్రాల్లో మొదటి విడత ఎస్‌ఐఆర్‌ను చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News