ఓ వైపు నిషేధం.. మరోవైపు బజరంగ్‌ బలీ సేవ..

Update: 2019-04-17 01:38 GMT

ఎన్నికల ప్రచారంలో నిషేధిత వ్యాఖ్యలు చేసి 72 గంటల ప్రచార నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రముఖ దేవాలయం హనుమాన్‌ సేతు దేవాలయాన్ని మంగళవారం సందర్శించారు. సుమారు ఆలయంలో ఆయన 25 నిమిషాలు ఉన్నారు. దీంతో యోగి ఆలయానికి వచ్చిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు జై గోరఖ్‌ధామ్, జై బజరంగ్‌ బలీ జీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈసీ ఆదేశాల నేపథ్యంలో లక్నో లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు గాను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నిర్వహించిన రోడ్‌షోలో సైతం యోగి పాల్గొనలేదు. ప్రస్తుత ఎన్నికలు ఆలీ, బజరంగ్‌ బలీ మధ్య జరిగే పోటీ అంటూ హిందువులు, ముస్లింల మధ్య వ్యత్యాసాన్ని చూపేలా మీరట్‌ సమావేశంలో సీఎం యోగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం 72 గంటల నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. 

Similar News