జార్ఖండ్‌, కర్ణాటకలో భూప్రకంపనలు

శుక్రవారం రెండు రాష్ట్రాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో 4.7, కర్ణాటకలోని హంపిలో 4 తీవ్రతతో భూకంప ప్రకంపన నమోదైంది.

Update: 2020-06-05 06:08 GMT

శుక్రవారం రెండు రాష్ట్రాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో 4.7, కర్ణాటకలోని హంపిలో 4 తీవ్రతతో భూకంప ప్రకంపన నమోదైంది.జాతీయ భూకంప కేంద్రం ప్రకారం, రెండు చోట్ల ఒకే సమయంలో భూకంపం సంభవించిందని, సరిగ్గా ఉదయం 6.55 గంటలకు భూకంప ప్రకంపనలు సంభవించాయి.. దాంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు.

అయితే ఎటువంటి ఆస్తినష్టం గాని ప్రాణనష్టం గాని జరగలేదని అధికారులు తెలియజేశారు. ఇదిలావుంటే నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ విడుదల చేసిన సమాచారం ప్రకారం బుధవారం అర్థరాత్రి ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో రిక్టర్ స్కేల్‌పై 3.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి. నోయిడాకు ఆగ్నేయంగా 19 కిలోమీటర్ల దూరంలో 3.8 కిలోమీటర్ల లోతులో ప్రకంపన నమోదైందని ఎన్‌సిఎస్ తెలిపింది.

Tags:    

Similar News