ఢిల్లీలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు
ఉత్తభారత దేశంలో భూ ప్రకంపనలు చోటు చేసుకుంది. దేశరాజధాని ఢిల్లీలో భూమి కంప్పించింది.
ఉత్తభారత దేశంలో భూ ప్రకంపనలు చోటు చేసుకుంది. దేశరాజధాని ఢిల్లీలో భూమి కంప్పించింది. దాదాపు రెండు సెకన్లపాటు భూమి కంపించిందని ఆక్కడి వారు ఆంటోన్నారు. ఒక్క సారిగా ఢిల్లీ భూప్రకంపనలు మొదలు కాగానే భయాందోళనలకు గురైన ప్రజలంతా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.7గా భూకంప తీవ్రత నమోదైయిందని అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తరప్రధేశ్ లోని మీరట్ సమీపంలో సార్థాన ప్రాంతం వద్ద భూమి కంపించినట్లు అధికారులు గుర్తించారు. హింమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపిచినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో ఇవాళ సాయంత్రం 5.45గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఢిల్లీలోని నోయిడా. ఘజియాబాద్ లో 4 సెకండ్లపాటు భూకంపం వచ్చింది. ఢిల్లీలో భూప్రకంపనలపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ప్రతి ఒక్కరూ సేఫ్ గా ఉన్నట్లు ఆశిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. ఆందరూ రక్షణ కోసం ప్రార్థిస్తున్నానని అన్నారు.
Tremors felt in Delhi. Hope everyone is safe. I pray for the safety of each one of you.
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 12, 2020