కడుపా..గాడ్జెట్‌ షాపా..? కడుపులో ఇయర్‌ఫోన్లు, నట్లు, బోల్టులు.. సర్జరీ చేసి బయటకు తీసిన డాక్టర్లు..

Punjab: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం.

Update: 2023-09-29 06:45 GMT

కడుపా..గాడ్జెట్‌ షాపా..? కడుపులో ఇయర్‌ఫోన్లు, నట్లు, బోల్టులు.. సర్జరీ చేసి బయటకు తీసిన డాక్టర్లు..

Punjab: పిల్లలు ఆడుకుంటూ.. అనుకోకుండా చిన్న చిన్న వస్తువులు మింగడం చూశాం. ఇంకొందరు విన్యాసాలు చేసేందుకు కొన్ని వస్తువులు మింగి మళ్లీ తీయడం చూస్తుంటాం.. మరికొంత మంది కాయిన్స్‌ మింగుతారు.. గొంతులో తట్టుకుని ఒక్కోసారి చిన్నపిల్లలు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత మంది వారికి తెలియకుండానే వెంట్రుకలు, గోర్లు తింటుంటారు. కడపు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వెళితే గానీ అసలు విషయం బయటపడదు.. సరిగ్గా అలాంటి సంఘటనే పంజాబ్‌లో జరిగింది.

పంజాబ్ లోని మోగా మెడిసిటీ హాస్పిటల్‌లో ఓ వింత సంఘటన జరిగింది. 40 ఏళ్ల వ్యక్తి కడుపు నొప్పితో ఆస్పత్రికి చేరుకున్నాడు.. అతడిని టెస్ట్‌ చేసిన వైద్యులు నోరెళ్ళబెట్టారు. ఎక్స్‌రేలో కనిపించిన వస్తువులు చూసిన వైద్యులకు కళ్ళు బైర్లు కమ్మాయి. వెంటనే సర్జరీ చేయకపోతే ప్రాణాలు దక్కవని ఆపరేషన్‌ చేశారు. దాదాపు 3 గంటల ఆపరేషన్ తర్వాత మొత్తం బయటకు తీశారు. కడుపులో ఇయర్‌ఫోన్‌లు, ఫోన్‌ ఛార్జర్లు, నట్లు, బోల్ట్‌లు, లాకెట్లు, స్క్రూలు, మాగ్నెట్‌లు సహా 70కి పైగా వస్తువులు బయటపడ్డాయి.

పేషెంట్‌ రెండేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడని.. తరచూ జ్వరం, వాంతులు అవుతున్నాయని డైరెక్టర్ తెలిపారు. ఎక్స్‌రే, స్కాన్ చేయగా... కడుపులో పలు రకాల మెటల్ వస్తువులు కనిపించాయని.. సర్జరీ చేసి బయటకు తీశామన్నారు. పేషెంట్‌ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. ఇన్ని వస్తువులు కడుపులో బయట పడటం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News