Viral Video: నాగుపాముకి ముద్దులు.. చివరికి..
Viral Video: మద్యం మత్తులో ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు.
Viral Video: నాగుపాముకి ముద్దులు.. చివరికి..
Viral Video: మద్యం మత్తులో ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్నాడు. ఓ నాగుపామును మెడలో వేసుకుని వీరంగం సృస్టించాడు. దానిని ముద్దాడి.. ఆటాడి.. పూజించి.. చివరకు కాటేయించుకుని ప్రాణం పొగొట్టుకున్నాడు. పామును మెడలో వేసుకుని.. దాని ముద్దాడాడు ఆ వ్యక్తి. ఆపై అక్కడే ఉన్న ఓ గుడి ముందుకు వెళ్లి పాము మెడలో ఉండగానే వంగి దండాలు పెట్టాడు. వద్దని చుట్టుపక్కల వాళ్లు ఎంత వారించినా వినకుండా పాముతో ఆటలు ఆడాడు. ఆపై పామును వదిలేశాడు. అయితే కాసేపటికే అతను కుప్పకూలిపోగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే పాము విషం ఎక్కి అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన బీహార్ నవాడాలోని నారాయణపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడ్ని దిలీప్ యాదవ్ గా గుర్తించారు.