గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన మహిళల విద్య:ఏసీఈఆర్ రిపోర్ట్
గ్రామీణ ప్రాంతాల్లోని తల్లుల్లో చదువుకున్నవారి సంఖ్య పెరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన మహిళల విద్య:ఏసీఈఆర్ రిపోర్ట్
గ్రామీణ ప్రాంతాల్లోని తల్లుల్లో చదువుకున్నవారి సంఖ్య పెరిగింది. జనవరిలో విడుదలైన ఏఎస్ఈఆర్ నివేదిక వెల్లడించింది. ఎప్పుడూ స్కూల్ కు హాజరుకాని తల్లుల నిష్పత్తి తగ్గింది. 2016లో ఎప్పుడూ స్కూల్ కు హాజరుకాని తల్లులు 46. 6 శాతం ఉంటే 2024 నాటికి ఈ సంఖ్య 29.4 శాతానికి పడిపోయింది. 2001-02లో ప్రారంభమైన సర్వశిక్ష అభియాన్‌తో ఈ ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
ప్రాథమిక విద్యాభ్యాసమే కాదు, టెన్త్ చదువుకున్న తల్లుల సంఖ్య కూడా పెరిగిందని నివేదిక తెలిపింది. 2016లో టెన్త్ చదివిన తల్లుల సంఖ్య 9.2 శాతం. అయితే 2024 నాటికి ఈ సంఖ్య 19.5 శాతానికి పెరిగింది. కేరళలో ఈ సంఖ్య అధికంగా ఉంది. 2016లోటెన్త్ చదువుకున్న తల్లుల సంఖ్య 40 శాతం ఉంది. 2024 నాటికి ఇది 69.6 శాతానికి పెరిగింది.
కేరళ తర్వాతి స్థానంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నిలిచింది. ఎనిమిదేళ్లలో ఈ సంఖ్య 22 శాతం పెరిగింది. 2016లో ఇక్కడ 30.17 మంది తల్లులు టెన్త్ చదువుకున్నారు. 2024 నాటికి ఈ సంఖ్య 52.4కు చేరింది.చదువుకున్న తల్లుల విషయంలో మధ్యప్రదేశ్ లో పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. 2016లో 9.7 శాతం ఉంది ఉంటే, 2024 నాటికి ఇది 3.6 శాతం మాత్రమే పెరిగింది.టెన్త్ చదివిన తండ్రుల శాతం పెరుగుదల కూడా తక్కువే. 2016లో 17.4% నుండి 2024లో 25%కి పెరిగింది. దేశంలోని 605 గ్రామీణప్రాంతాల్లోని స్కూల్స్ లో ఈ సర్వే నిర్వహించారు.