Antibody Test: రూ.75కే యాంటీబాడీ పరీక్ష; కిట్‌ను తయారుచేసిన డీఆర్ఢీవో

Antibody Test: డీఆర్‌డీవో సంస్ధ యాంటీబాడీ డిటెక్షన్ కిట్‌ను అభివృద్ధి చేసింది.

Update: 2021-05-22 06:32 GMT

డిప్కోవన్ (ఫొటో ట్విట్టర్)

Antibody Test: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) సంస్ధ యాంటీబాడీ డిటెక్షన్ కిట్‌ను అభివృద్ధి చేసింది. దీనిని 'డిప్కోవన్' అని పిలువనున్నారు. దీనిని కొవిడ్-19 యాంటీబాడీలను గుర్తించేందుకు పనిచేయనుంది. ఇది జూన్ మొదటి వారం నుంచి మార్కెట్లో లభించనుంది. దీని ధర రూ .75గా మాత్రమే.

కొవిడ్‌ వైరస్‌ స్పైక్‌, న్యూక్లియోకాప్సిడ్‌ ప్రొటీన్లను 97 శాతం గుర్తిస్తున్నట్లు టెస్టుల్లో తేలిందని సంస్థ పేర్కొంది. ఈ కిట్‌ను డీఆర్‌డీవోకు చెందిన దిల్లీలోని డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్ (డిపాస్) సైంటిస్టులు దేశీయంగానే అభివృద్ధి చేశారు. పలు హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న 1000 మంది కొవిడ్ రోగులపై పలుమార్లు పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు పక్కాగా రావడంతో దీనిని ఐసీఎంఆర్ ఆమోదించింది.

తాజాగా డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ), సెంట్రల్‌ డ్రగ్స్‌ స్లాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నుంచి కూడా ఆమోదం లభించింది. దీంతో కిట్ల తయారీకి, మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు డీఆర్ఢీవో ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేవలం 75 నిమిషాల వ్యవధిలోనే యాంటీబాడీ టెస్ట్‌ నిర్వహించవచ్చు. ఒక్కో పరీక్షకు రూ.75 వరకు ఖర్చు అవుతుంది. ఒక్కో కిట్‌తో 100 మందికి పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ కిట్లను జూన్‌ మొదటి వారంలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ మేరకు వాన్‌గార్డ్‌ డయాగ్నస్టిక్స్‌ అనే సంస్థతో డీఆర్డీవో ఒప్పందం కుదుర్చుకుంది.

Tags:    

Similar News