అద్దెకున్న వ్యక్తికి యజమాని ఇంటిపై హక్కు ఉంటుందా..! చట్టం ఏం చెబుతోంది..?

Tenant Right: సాధారణంగా ఒక యజమాని తన ఇంటిని అద్దెకిచ్చినప్పుడు అతనికి ఒకరకమైన భయం ఉంటుంది.

Update: 2021-11-22 16:21 GMT

అద్దెకున్న వ్యక్తికి యజమాని ఇంటిపై హక్కు ఉంటుందా..! చట్టం ఏం చెబుతోంది..? (ఫైల్ ఇమేజ్)

Tenant Right: సాధారణంగా ఒక యజమాని తన ఇంటిని అద్దెకిచ్చినప్పుడు అతనికి ఒకరకమైన భయం ఉంటుంది. అద్దెకున్న వ్యక్తులు తన ఇంటిని ఎక్కడ ఆక్రమించుకుంటారో అని నిత్యం గమనిస్తూ ఉంటాడు. అంతేకాదు అద్దెకున్న వ్యక్తులను ఎక్కువ రోజులు ఉండనివ్వడు. నిత్యం మారుస్తూ ఉంటారు. దీనికి కారణం తన ఆస్తిని ఎక్కడో కోల్పోతామోనన్న భయమే. అయితే నిజంగా అద్దెదారులకు యజమాని ఆస్తిపై హక్కు ఉంటుందా. చట్టం ఏం చెబుతుంది. తదితర విషయాల గురించి తెలుసుకుందాం.

న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం. అద్దెదారు ఏ ఆస్తిని ఆక్రమించలేడు. యజమాని ఆస్తిపై అతనికి ఎటువంటి హక్కు ఉండదు. కానీ దీనిపై హక్కు సంపాదించే అవకాశం మాత్రం ఉంది. ఇది వివిధ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అప్పుడు యజమాని తన ఆస్తిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఎవరైనా 12 సంవత్సరాల పాటు అద్దెకు ఉన్నట్లయితే ఆస్తిపై హక్కును పొందుతాడు. ఉదాహరణ ఒక వ్యక్తి తన ఆస్తిని తనకు తెలిసిన వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు.

11 సంవత్సరాలకు పైగా నివసిస్తున్నట్లయితే అతను ఆ ఆస్తిపై హక్కును కోరవచ్చు. అయితే ఇలా కాకుడదంటే యజమాని అద్దె ఒప్పందాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. అంతేకాదు అద్దె వసూలు చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు యజమాని ఆస్తులను ఎవరూ స్వాధీనం చేసుకునే అవకాశం ఉండదు. ఇటీవల సుప్రీంకోర్టు పరిమితి చట్టం 1963 ప్రకారం ప్రైవేట్ స్థిరాస్తిపై చట్టబద్ధమైన పరిమితి 12 సంవత్సరాలు, ప్రభుత్వ స్థిరాస్తి విషయంలో ఇది 30 సంవత్సరాలు అని పేర్కొంది. ఈ కాలం స్వాధీనం చేసుకున్న రోజు నుంచి ప్రారంభమవుతుంది.

Tags:    

Similar News