మూత్రాశయం నుండి మొబైల్ ఛార్జర్ తొలగింపు..

అస్సాంలోని గువహతిలో శస్త్రచికిత్స ద్వారా 30 ఏళ్ల వ్యక్తి మూత్రాశయం నుండి మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌ను వైద్యులు తొలగించారు.

Update: 2020-06-06 15:09 GMT

అస్సాంలోని గువహతిలో శస్త్రచికిత్స ద్వారా 30 ఏళ్ల వ్యక్తి మూత్రాశయం నుండి మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌ను వైద్యులు తొలగించారు. గువహతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ సర్జన్ అయిన డాక్టర్ వాలియుల్ ఇస్లాం ఇటీవల 30 ఏళ్ల వ్యక్తికి శస్త్రచికిత్స నిర్వహించి, తన మూత్రాశయం నుండి దీనిని తొలగించాడు.

దీనిపై డాక్టర్ వాలియుల్ ఇస్లాం మాట్లాడుతూ.. సదరు వ్యక్తి కొద్ది రోజుల క్రితం తన వద్దకు వచ్చి కడుపునొప్పితో బాధపడుతున్నానని చెప్పాడు, అంతేకాకుండా తాను పొరపాటున ఛార్జింగ్ కేబుల్ ను తన శరీరంలోకి చొప్పించినట్టు చెప్పాడని అన్నారు.

ఈ క్రమంలో వైద్యులు మొదట్లో అతనికి ఎండోస్కోపీ చేయగా.. అతని కడుపులో కేబుల్ కనిపించలేదని.. దాంతో స్వయంగా తానే రంగంలోకి దిగానన్నారు. ముందుగా ఎక్స్‌రే తీయగా.. అతని మూత్రాశయంలో మొబైల్ ఛార్జింగ్ కేబుల్ చూసి డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎలాగోలా ఆపరేషన్ చేసి ఆ కేబుల్ ను బయటికి తీశారు డాక్టర్. తన 25 ఏళ్ల వయసులో ఇలాంటి ఘటనలు చూడలేదని అన్నారు. 

Tags:    

Similar News