Google Maps: గూగుల్ మ్యాప్‌తో తిరుమలకు ప్రయాణం.. వాగులో పడిపోయిన కారు

Google Maps: ఈ మధ్య కాలంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా.. గూగుల్ మ్యాప్‌ని మాత్రం బాగా నమ్ముతున్నారు.

Update: 2025-07-05 05:54 GMT

Google Maps: గూగుల్ మ్యాప్‌తో తిరుమలకు ప్రయాణం.. వాగులో పడిపోయిన కారు

Google Maps: ఈ మధ్య కాలంలో ఎవరిని నమ్మినా నమ్మకపోయినా.. గూగుల్ మ్యాప్‌ని మాత్రం బాగా నమ్ముతున్నారు. ఎందుకంఏట ఎక్కడికి వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ ఉందిగా అని భరోసాగా వెళ్లిపోతున్నారు. కానీ ఈ గూగుల్ మ్యాపే ఇప్పుడు వీళ్ల కొంప ముంచింది. గూగుల్ మ్యాప్ సహాయంతో తిరుమలకు కారులో వెళ్తుండగా జనగాం దగ్గర ఒక వాగులో కారు పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్నవారికి తీవ్ర గాయాలయ్యాయి.

కొత్త కొత్త ప్రదేశాలకు ఇప్పుడు ఈజీగా వెళ్లిపోవచ్చు. గూగుల్ మ్యాప్ చేతులో ఉంటే. ఇప్పుడు అందరూ అదే అనుకుంటున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకున్నవారిలో చాలామందికి తీవ్ర నష్టాలు జరిగాయి. అనుకోని ప్రమాదాలు జరిగాయి. మొన్న ఒక వ్యక్తి పార్క్‌కి వెళ్లాలని గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే అది స్మశానం గేటు దగ్గరకు తీసుకెళ్లి ఆపిందట. ఇప్పుడు అలానే జరిగింది. మహారాష్ట్ర నుంచి తిరుమలకు కారులో వెళ్తున్న కొందమంది గూగుల్ మ్యాప్ సహాయంతో రోడ్డుపై రయ్ మని వెళ్లిపోతున్నారు. కానీ ఎదురుగా అకస్మాత్తుగా ఒక వాగు వచ్చింది. సడన్‌గా రోడ్డుపైకి వాగు ఎలా వచ్చిందో అని తెలుసుకునేలోపే కారు ఆ వాగులో పడిపోయింది.

మహారాష్ట్రకు చెందిన కొందరు యువకులు నాగపూర్ నుంచి తిరుపతికి వెళ్తున్నారు. గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుని జనగామ జిల్లా మీదుగా కారులో వెళ్తున్నారు. సరిగ్గా వడ్లకొండ దగ్గరకు రాగానే ఎదురుగా ఉన్న వాగులో కారు పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి.. గాయపడ్డవారిని రక్షించారు.

అయితే.. ఈ ప్రమాదం జరిగిన చోట బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. దానికి తోడు ఇక్కడ ఎలాంటి హెచ్చరికల బోర్డులు కూడా లేవు. గూగుల్ మ్యాప్‌ చూపినట్లుగా ఇక్కడ వరకు వచ్చేసామని, అంతేకాకుండా ఇక్కడ ఎలాంటి హెచ్చరికలు బోర్డులు లేకపోవడంతో ఇంకా ముందు రోడ్డు ఉందనే అనుకున్నామని బాధితులు పోలీసులకు చెప్పారు. ఈ కేసును పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News