Omicron - Demand for Mask: ఒమిక్రాన్ భయంతో మాస్కులకు పెరిగిన డిమాండ్

Omicron - Demand for Mask: *మార్కెట్‌లో సర్జికల్ మాస్కులు దరొకని పరిస్థితి *ఎన్-95 మాస్కులు రూ.50లకు విక్రయం

Update: 2021-12-08 04:37 GMT

Omicron - Demand for Mask: ఒమిక్రాన్ భయంతో మాస్కులకు పెరిగిన డిమాండ్

Omicron - Demand for Mask: కరోనా వ్యాపించి రెండేళ్లు అయినా తన విశ్వరూపాన్ని చూపిస్తూనే ఉంది. కొత్త వేరియంట్‌లతో విరుచుకుపడుతోంది. ఆల్ఫా, డెల్టా, ఒమిక్రాన్‌లుగా ప్రపంచంపై దండెత్తుతూనే ఉంది. ప్రస్తుతం ఒమిక్రాన్ రూపంలో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది.

భౌతికదూరం, మాస్క్‌లు ధరించడంతోనే కరోనాను అరికట్టవచ్చని నిపుణులు, వైద్యులు మరోసారి హెచ్చరిస్తున్నారు. మరోవైపు మాస్క్‌లేని వారికి ఫైన్ వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తుండటంతో మరోసారి మాస్కులకు డిమాండ్ పెరిగింది.

గతకొన్ని రోజుల వరకు మాస్కులను పెద్దగా పట్టించుకోని వారు ఒమిక్రాన్ భయంతో మళ్లీ మాస్కులు ధరిస్తున్నారు. దీంతో సర్జికల్ మాస్కులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. కంపెనీల్లో కూడా స్టాక్ లేకపోవడంతో రోజురోజుకి సర్జికల్ మాస్కుల కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే నగరంలో ఉన్న డీలర్లకు సిటీతో పాటు జిల్లాల్లోని మెడికల్ స్టోర్లు, షాపుల నుంచి పెద్ద ఎత్తు ఆర్డర్లు వస్తున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిన తర్వాత మాస్క్‌ల గురించి సిటిజన్లు పెద్దగా పట్టించుకోలేదు. హోల్‌సెల్‌లో మొన్నటి వరకు యూజ్ అండ్ త్రో మాస్క్‌లు రెండు, మూడు రూపాయలకు దొరకగా.. ప్రస్తుతం వాటి రేట్లు రెట్టింపయ్యాయి.

నగర శివారు ప్రాంతాల్లో దాదాపు 50 వరకు మాస్క్ తయారీల కంపెనీలు ఉన్నాయి. కరోనా కేసులు మొదలైనప్పుడు ఒక్కో కంపెనీలో ప్రతిరోజు 30 వేల నుంచి లక్ష వరకు మాస్క్‌లు తయారయ్యేవి. అప్పట్లో డిమాండ్ ఉండటంతో అందుకు తగట్లు ప్రొడక్షన్ ఉండేది. కరోనా కేసులు తగ్గుతున్న కొద్దీ డిమాండ్ తగ్గుతూ వచ్చింది.

ఈ ఏడాది జూన్ తర్వాత పూర్తిగా డిమాండ్ లేకపోవడంతో కంపెనీలు రా మెటీరియల్ స్టాక్‌ను పెట్టుకోలేదు. ఇప్పుడు ఒమిక్రాన్ భయంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మాస్క్‌లు కావాలంటూ కంపెనీలకు ఆర్డర్లు వస్తున్నాయి. రా మెటీరియల్ లేదని, మాస్క్‌ల తయారీకి కొంచెం టైమ్ పడుతుందని డీలర్లకు చెప్తున్నారు.

ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, గతంలో కంటే జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అయితే ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైన వేరియంట్ కాదని అంటున్నారు.

Tags:    

Similar News