Delhi Old Vehicle Ban: ఢిల్లీలో కొత్త పాలసీ రచ్చ.. యజమానుల ఆవేదన.. లక్షల కార్లు చిల్లర ధరకే
Delhi Old Vehicle Ban: దిల్లీలో జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త వాహన పాలసీ కారణంగా వాహన యజమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.
Delhi Old Vehicle Ban: దిల్లీలో జూలై 1 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త వాహన పాలసీ కారణంగా వాహన యజమానులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పదేళ్లు పైబడిన డీజిల్, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలకు ఇకపై ఫ్యుయల్ బంకుల్లో ఇంధనం పోయబోదని ప్రభుత్వం ప్రకటించడంతో, చాలామంది తమ వాహనాలను తక్కువ ధరలకు అమ్మకానికి పెట్టారు.
ఈ నిర్ణయం కారణంగా ఇప్పటికే చాలామంది కార్ల యజమానులు తమ విలువైన వాహనాలను నామమాత్రపు ధరలకు విక్రయించారు. సోషల్ మీడియా వేదికగా కొన్ని క్రయవిక్రయాల వివరాలు కూడా వైరల్ అయ్యాయి.
ఈ పాలసీ అమలుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో, చివరి నిమిషంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే అప్పటికే కార్లు అమ్మిన యజమానులు తీవ్రంగా మనస్తాపానికి లోనయ్యారు. "ముందే తెలిస్తే ఇలా తక్కువ ధరకు మా కార్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాదు" అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దిల్లీకి చెందిన నితిన్ గోయల్ తన రూ.65 లక్షల విలువైన జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను కేవలం రూ.8 లక్షలకు అమ్మకానికి పెట్టేశాడు. అలాగే రితేశ్ గందోత్ర అనే వ్యక్తి తన రూ.55 లక్షల లగ్జరీ ఎస్‌యూవీ కారును తక్కువ రేటుకు అమ్మేశాడు. తమలాంటి వాహనదారులు వందల సంఖ్యలో నష్టపోయారని వారు తెలిపారు.
ఈ ఘటనపై దిల్లీ వాహన యజమానులు తీవ్ర అసంతృప్తితో ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్నారు. ముందుగానే స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా, పర్యావరణం పేరుతో ఇలా ఆస్తులపై నష్టానికి గురి చేశారని ఆరోపిస్తున్నారు.