Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేస్తున్న పొగ, కాలుష్యం..
Delhi Air Pollution: ఢిల్లీ వాసులకు దీపావళికి ముందే కష్టకాలం మొదలైంది. ప్రతి ఏడాది చలికాలంలో ఢిల్లీ వాసులు తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతుంటారు.
Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేస్తున్న పొగ, కాలుష్యం..
Delhi Air Pollution: ఢిల్లీ వాసులకు దీపావళికి ముందే కష్టకాలం మొదలైంది. ప్రతి ఏడాది చలికాలంలో ఢిల్లీ వాసులు తీవ్ర వాయు కాలుష్యంతో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఈ ఏడాది మరింత ముందుగానే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. తాజాగా ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 334గా నమోదైనట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.
చలి తీవ్రత పెరగడం, వాయు వేగం తగ్గడంతో ఢిల్లీ, చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి తగ్గిపోతోంది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాల దహనం వల్ల రాజధాని నగరం ఢిల్లీని పొగ అలిమేస్తోంది. దీంతో రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కళ్ళ మంటలు, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.