Delhi Pollution: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి కాలుష్యం.. 379కి చేరిన AQI
Delhi Pollution: ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. సగటు AQI 379గా నమోదవగా, గ్రాప్-4 చర్యలు అమలు చేస్తూ డీజిల్ వాహనాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.
Delhi Pollution: ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి కాలుష్యం.. 379కి చేరిన AQI
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరవ్యాప్తంగా సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 379 పాయింట్లుగా నమోదైంది. ఢిల్లీలోని 23 ప్రాంతాల్లో AQI 400 పాయింట్లకు పైగా నమోదు కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.
కాలుష్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-4 చర్యలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు హైబ్రిడ్ విధానంలో తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే నగరంలో డీజిల్ వాహనాల రాకపోకలపై నిషేధం విధించింది.
కాలుష్యంతో పాటు భారీగా పొగమంచు కమ్మేయడంతో రవాణా వ్యవస్థపై ప్రభావం పడింది. విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలుష్య నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని అధికారులు తెలిపారు.