Delhi Lockdown: ఢిల్లీలో మరో వారం లాక్‌డౌన్ పొడగింపు
Delhi Lockdown: కరోనా ఉధృతితో మే 31 వరకు లాక్‌డౌన్ * కేసులు తగ్గితే దశల వారీగా అన్ లాక్ ప్రక్రియ
Image Source: NDTV
Delhi Lockdown: ఢిల్లీలో మరో వారం రోజులు లాక్‌డౌన్ పొడగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మే 31 తర్వాత కేసులు తగ్గితే.. దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. లాక్‌డౌన్ వల్ల ఢిల్లీలో కొవిడ్ పాజిటివిటీ రేటు 2.5శాతానికి తగ్గిందని చెప్పారు. ప్రతి ఒక్కరికి టీకాలు వేస్తేనే థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనే అవకాశం ఉందని, అందరికీ వీలైనంత త్వరగా టీకాలు వేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఇక ఢిల్లీలో పెరుగుతున్న కొవిడ్ కేసులతో ఏప్రిల్ 19న ఢిల్లీలో లాక్‌డౌన్ ప్రకటించగా.. పలుసార్లు పొడగిస్తూ వచ్చారు. తాజాగా మారో వారం పొడిగించారు.