Delhi Cars: పాత వాహనాల నిషేధంపై ఎల్‌జి ప్రభుత్వానికి లేఖ.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్
Delhi Cars: ఢిల్లీలో పాత వాహనాల పై నిషేధం విధించే నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఢిల్లీ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు.
Delhi Cars: పాత వాహనాల నిషేధంపై ఎల్‌జి ప్రభుత్వానికి లేఖ.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్
Delhi Cars: ఢిల్లీలో పాత వాహనాల పై నిషేధం విధించే నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా ఢిల్లీ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఈ విధమైన నిషేధానికి ఢిల్లీ ఇంకా సిద్ధంగా లేదని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎప్పటికప్పుడు కొత్త నియమాలు వస్తుంటాయి. వీటిలో కాలం చెల్లిన వాహనాలపై నిషేధం కూడా ఒకటి. ప్రస్తుతానికి ఈ ఆదేశాన్ని నిలిపివేయాలని వి.కె. సక్సేనా కోరారు.
EOL (End of Life) వాహనాలు అంటే, వాటి వ్యాలిడిటీ టైం ముగిసిన వాహనాలు. సాధారణంగా పెట్రోల్ వాహనాలకు 15 సంవత్సరాలు, డీజిల్ వాహనాలకు 10ఏళ్లు చెల్లుబాటు కాలం ఉంటుంది. ఎయిర్ పోల్యూషన్ కంట్రోల్ చేసేందుకు ఈ గడువు ముగిసిన తర్వాత అలాంటి వాహనాలను నడపడం నిషేధించబడింది.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా, EOL వాహనాలపై నిషేధం నిర్ణయాన్ని ఆపాలని ఢిల్లీ ప్రభుత్వానికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం వల్ల సాధారణ ప్రజలు ఎదుర్కొనే అనేక ఇబ్బందులను ఆయన ఈ లేఖలో వివరించారు. లక్షలాది వాహనాలను తొలగించడానికి లేదా స్క్రాప్ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ప్రస్తుతం ఢిల్లీలో లేవని ఎల్‌జి అన్నారు.
మధ్యతరగతి ప్రజలు తమ మొత్తం పొదుపును పెట్టి వాహనం కొంటారని, అలాంటి వారి వాహనాన్ని ఉన్నట్టుండి అక్రమంగా ప్రకటించడం తప్పు అని ఎల్‌జి వాదించారు. పాత వాహనాలు కేవలం ఒక యంత్రం మాత్రమే కాదని, ఎన్నో జ్ఞాపకాలలో భాగమని, ప్రజలకు వాటితో భావోద్వేగ బంధం ఉంటుందని ఆయన అన్నారు. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని మరోసారి పరిశీలించడానికి ఒక రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఎల్‌జి ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.