Republic Day 2023: 74వ గణతంత్ర వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ శకటం

Republic Day 2023: ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ శకటం

Update: 2023-01-26 06:59 GMT

Republic Day 2023: 74వ గణతంత్ర వేడుకలు.. అబ్బురపరిచిన శకటాల ప్రదర్శన

Republic Day 2023: ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగిన 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శకటం సందడి చేసింది. మకర సంక్రాంతి సందర్భంగా రైతుల పండుగ అయిన 'ప్రభల తీర్థం'ను వర్ణించే ఏపీ శకటం అందరిని ఆకట్టుకుంది. ఎర్రకోట వరకు సాగిన త్రివిద దళాల సైనిక కవాతులు, కేంద్ర, రాష్ట్ర శకటాల ప్రదర్శనలు, వైమానిక విన్యాసాలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా 17 రాష్ట్రాలు, 6 కేంద్ర ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన నిర్వహించారు. దక్షిణ భారత దేశం నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు అవకాశం దక్కగా తెలంగాణ శకటమేది ఎంపిక కాలేదు.

450 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రభల తీర్థం సంస్కృతితో ఏపీ శకటాన్ని తీర్చి దిద్దారు. ప్రభల తీర్థానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కడంపై కోనసీమ జిల్లా అంబాజిపేట మండలం గంగకులకూరు అగ్రహారం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. 500 ఏళ్ల క్రితం నుంచి ఈ సంస్కృతి ఉందని, 400 ఏళ్లుగా ఒక పద్ధతిలో కొనసాగుతూ వస్తోందని చెప్పారు. కోనసీమ జిల్లా జగ్గన్నతోటలో కనుమ నాడు ప్రభల తీర్థం వేడుక జరుగుతుంది. ఏకాదశ రుద్రులను ఒక చోట చేర్చడమే ప్రభల తీర్థం పరమార్థమని ప్రతీతి.

Tags:    

Similar News