Manish Sisodia: ఢిల్లీ హైకోర్టులో మనీష్‌ సిసోడియాకు చుక్కెదురు

Manish Sisodia: సిసోడియా బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

Update: 2023-05-30 07:23 GMT

Manish Sisodia: ఢిల్లీ హైకోర్టులో మనీష్‌ సిసోడియాకు చుక్కెదురు

Manish Sisodia: ఆప్‌ కీలక నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు గట్టి దెబ్బే తగిలింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మనీష్ సిసోడియాపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి, కాబ్టటి బెయిల్ మంజూరు చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అనవసర ప్రయోజనాల కోసం కుట్ర పూరితంగా ఆ ఎక్సైజ్ పాలసీని రూపొందించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆషామాషీ వ్యక్తి కాదని... అరెస్ట్‌ సమయానికి మంత్రిగా ఉన్నారని... పైగా 18 శాఖల నిర్వహణను చూసుకున్నారని... అలాంటి వ్యక్తి బయటకు వస్తే సాక్ష్యులను ప్రలోభ పెట్టి.. ఆధారాలను తారుమారు చేసే అవకాశం లేకపోలేదు అంటూ హైకోర్టు సిసోడియా బెయిల్‌ అభ్యర్థనను తిరస్కరించింది.

లిక్కర్‌ స్కాంలో ఫిబ్రవరి 26న మనీష్‌ సిసోడియాను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఆయన తీహార్ జైలులో ఉన్నారు. ఈ కుంభకోణంలో నిందితుడిగా సిసోడియా పేరును ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చిన సీబీఐ... సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో రెండు ఫోన్లను నాశనం చేశారని ఆయన ఒప్పుకున్నట్లు ప్రస్తావించింది. మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సైతం ఆయనపై మనీల్యాండరింగ్‌ అభియోగాలు నమోదు చేసి ప్రశ్నించింది. అంతకు ముందు స్థానిక కోర్టులో ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌‌ సైతం తిరస్కరణకు గురైంది.

Tags:    

Similar News