చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వండి ఢిల్లీ హైకోర్టు ఆదేశం

ఐఎక్ఎక్స్ మీడియాలో రూ.304 విదేశీ పెట్టుబడులు వ్యవహారంలో అవినీతీ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం జైలులో ఇటీవలే అనారోగ్యానికి గురైయ్యారు.

Update: 2019-10-31 08:46 GMT

ఐఎక్ఎక్స్ మీడియాలో రూ.304 విదేశీ పెట్టుబడులు వ్యవహారంలో అవినీతీ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం జైలులో ఇటీవలే అనారోగ్యానికి గురైయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు.దీంతో చిదంబరం తరుపున లాయర్ హైకోర్టును విన్నవించారు. చిదంబరం ఆరోగ్యంపై తక్షణమే మెడికల్ బోర్డు ఏర్నాటు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ కు చెందిన చిదంబరం ఫ్యామిలీ డాక్టర్ నాగేశ్వర రెడ్డితో కలిసి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.

ఐఎన్ఎక్స్ మీడియా ముడుపులు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ చిదంబరం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం మందగించడంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపిన అనంతరం మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ రోజు(గురువారం) సాయంత్రం లోగా బోర్డు ఏర్పాటు చేసి శుక్రవారం చిదంబరం ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Tags:    

Similar News