Delhi Election Results 2025: బీజేపీ గెలుపునకు కాంగ్రెస్ ఎలా కారణమైంది?

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విడి విడిగా పోటీ చేయడం పరోక్షంగా బీజేపీకి కలిసి వచ్చింది.

Update: 2025-02-08 14:33 GMT

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు విడి విడిగా పోటీ చేయడం పరోక్షంగా బీజేపీకి కలిసి వచ్చింది. చాలా స్థానాల్లో ఆప్ అభ్యర్థులు వెయ్యి నుంచి రెండు వేలలోపు ఓట్లతో ఓడిన స్థానాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఈసారి 6 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఇది పరోక్షంగా బీజేపీ గెలుపునకు కలిసి వచ్చింది.

ఇండియా కూటమిలోనే కాంగ్రెస్, ఆప్‌ ఉన్నాయి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ రెండు పార్టీలు విడి విడిగా పోటీ చేశాయి. ఇది బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చాయి. ఇది పరోక్షంగా కమలం పార్టీకి కలిసి వచ్చింది. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే ఆప్ కనీసం 15 సీట్లలో గెలిచి ఉండేది. కాంగ్రెస్ చీల్చిన ఓట్లను కలిపితే ఆప్ అభ్యర్ధులు గెలిచేవారు.

రాజేంద్రనగర్, ఛత్తాపూర్, సంగం విహార్, గ్రేటర్ కైలాష్ వంటి నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థుల ఓటమికి పరోక్షంగా కాంగ్రెస్ కారణమైంది. రాజేంద్రనగర్ లో ఆప్ అభ్యర్ధికి 45,440 ఓట్లు వచ్చాయి. ఇదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధికి 4,015 ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు కలిపితే 49,455 కు చేరుతాయి. అదే జరిగితే ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి ఓటమి ఖాయమే.

కాంగ్రెస్ చీల్చిన ఓట్లతో బీజేపీ గెలుపు సాధించిన నియోజకవర్గాలు


నియోజకవర్గం పేరుగెలిచిన పార్టీమెజార్టీకాంగ్రెస్ కు వచ్చిన ఓట్లు

సంగం విహార్

బీజేపీ గెలుపు34415863
రాజేంద్రనగర్బీజేపీ గెలుపు12314015
త్రిలోక్ పురిబీజేపీ గెలుపు3921147
బద్లీబీజేపీ గెలుపు658926,359
మాల్‌వియానగర్బీజేపీ గెలుపు20316770
జంగాపురబీజేపీ గెలుపు6757350
న్యూదిల్లీబీజేపీ గెలుపు40494541
యుకెహెచ్బీజేపీ గెలుపు30396677
తిమర్‌పూర్బీజేపీ గెలుపు3165754
నంగ్లోయ్బీజేపీ గెలుపు2625132028


10 ఏళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ 70 నియోజకవర్గాల్లో హస్తం పార్టీ తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేసింది. ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. గెలవకున్నా కూడా ఆప్ ఓటమికి కాంగ్రెస్ కారణమైంది. దిల్లీలో ఆ పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలపడేందుకు ఈ ఎన్నికలు హస్తం పార్టీకి కలిసి వచ్చాయి.

Tags:    

Similar News