Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. ముజమ్మిల్ విచారణలో విస్తుపోయే విషయాలు
Delhi Blast: ఢిల్లీ కారు పేలుడు ఘటనలో మరో కొత్త సీసీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది.
Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. ముజమ్మిల్ విచారణలో విస్తుపోయే విషయాలు
Delhi Blast: ఢిల్లీ కారు పేలుడు ఘటనలో మరో కొత్త సీసీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. పేలుడు ధాటికి సీసీటీవీలు ఒక్కసారిగా ఆగిపోయాయి. పేలుడు కేసు దర్యాప్తులో ఈ సీసీటీవీ ఫుటేజీ కీలకంగా మారనుంది. ఇక.. ఢిల్లీ పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ముజమ్మిల్ విచారణలో విస్తుపోయే విషయాలు రాబట్టారు అధికారులు.
జనవరి 26న ఎర్రకోట లక్ష్యంగా ఉగ్రదాడి జరపాలని ప్లాన్ చేసినట్టు సమాచారం సేకరించారు. ఇందులో భాగంగా.. జనవరి మొదటివారంలోనే ఎర్రకోటలో ముజమ్మిల్‌తో పాటు డాక్టర్ ఉమర్ రెక్కీ నిర్వహించారు. అంతేకాదు.. దీపావళి రోజున రద్దీగా ఉండే ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకొని బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారు ఉగ్రవాదులు. ముజమ్మిల్ ఫోన్ నుంచి ఈ సమాచారాన్ని పోలీసులు సేకరించారు.