Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. ఫరీదాబాద్ మాడ్యూల్‌కు టర్కీతో లింకులు
Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు.. ఫరీదాబాద్ మాడ్యూల్‌కు టర్కీతో లింకులు
Delhi Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫరీదాబాద్ మాడ్యూల్‌పై లోతుగా విచారణ జరపగా.. టర్కీతో లింకులు ఉన్నట్టు వెల్లడైంది. డాక్టర్ మహ్మద్ ఉమర్, ముజిమ్మిల్‌లకు టర్కీ హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్టు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఈ ఏడాది ప్రారంభంలో టర్కీలో ఉమర్, ముజిమ్మిల్ పర్యటించారని పేర్కొన్నారు. రెండు టెలిగ్రామ్ గ్రూపులలో ఉగ్రవాదులు జాయిన్ అవగా అందులో టర్కీ హ్యాండ్లర్లు హ్యాండిల్ చేస్తున్న గ్రూప్‌లో కశ్మీర్ ఆజాదీపై ప్రసంగాలు ఇచ్చారు.
ఈ గ్రూప్‌లోనే భారత్‌లో వివిధ ప్రాంతాలలో దాడులు చేయాలని టర్కీ హ్యాండ్లర్లు ప్లాన్ చేశారు. అందుకు తగిన డైరెక్షన్‌లను ఉగ్రవాదులు ఉమర్, ముజిమ్మిల్‌కు ఇచ్చారు. దీంతో టర్కీ లింకులు, హ్యాండ్లర్లు ఎవరనే దానిపై NIA ఫోకస్ చేసింది. మరోవైపు ఈ ఇద్దరు ఉగ్రవాదులు ఫరీదాబాద్ అల్ ఫలా యూనివర్శిటీకి చెందిన వారు కావడంతో ఆ యూనివర్శిటీపై NIA నిఘా పెట్టింది. ఉగ్రవాదులకు కేంద్రంగా యూనివర్శిటీ ఎలా మారిందన్న దానిపై దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. త్వరలోనే NIA అధికారులు యూనివర్శిటీకి వెళ్లి ఉమర్, ముజిమ్మిల్‌కు సంబంధించిన విషయాలపై విచారించనున్నారు.