ఢిల్లీ ఎర్రకోట పేలుడు: వెలుగులోకి కారు రిజిస్ట్రేషన్, అనుమానితుల వివరాలు!
ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనతో కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఢిల్లీ ఎర్రకోట పేలుడు: వెలుగులోకి కారు రిజిస్ట్రేషన్, అనుమానితుల వివరాలు!
ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనతో కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం సాయంత్రం 6:52 గంటలకు జరిగిన ఈ బాంబు బ్లాస్ట్‌లో ఎనిమిది మంది మృతి చెందగా, 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి 10 వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
దర్యాప్తులో కీలకాంశాలు:
కారు రిజిస్ట్రేషన్: ఈ పేలుడుకు ఉపయోగించిన ఐ20 కారు (రిజిస్ట్రేషన్ నంబర్: HR26CE7674) గురుగ్రామ్ ఆర్టీవో (Gurugram RTO) వద్ద మహమ్మద్ సల్మాన్ పేరుతో నమోదై ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అనుమానితులు: అరెస్ట్ అయిన సల్మాన్ ఈ కారును పుల్వామా నివాసి తారిక్‌కు అమ్మినట్లు తెలిపాడు. అయితే, పేలుడుకు కారణమైన వ్యక్తి ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్న వైద్యుడు మహ్మద్ ఉమర్ (Mohammed Umar) అయి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు.
టైమింగ్స్: పేలుడుకు ముందు ఐ20 కారు పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు (మధ్యాహ్నం 3:19 నుండి సాయంత్రం 6:48 వరకు) నిలిపి ఉంచినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా వెల్లడైంది.
భద్రతా చర్యలు:
ఘటన నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట పరిసర ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. ముందు జాగ్రత్తగా మెట్రోలను మూసివేయడంతో పాటు, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (IGI Airport) సహా ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో నిఘా పెంచారు. క్లూస్ టీమ్స్ సంఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాయి.