ఇవాళ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు

* మొత్తం 30వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత

Update: 2022-12-04 01:56 GMT

ఇవాళ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల అధికారులు 

New Delhi: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. భద్రత పరంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 250 వార్డులకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కోసం మొత్తం 13 వేల 638 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 13 వందల 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డుల పునర్విభజన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల భద్రతా విధుల్లో 30 వేల భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. భద్రాతా చర్యల్లో భాగంగా ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఎన్నికల ప్యానెల్ 68 మోడల్ పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేశారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల అధికారులు అయాప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. పోలింగ్ లో భాగంగా ఆదివారం ఉదయం నాలుగున్నర నుంచే మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. గత 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఈసారి ఆప్ బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొననుంది. 

Tags:    

Similar News