Heavy Rains in Delhi: దేశరాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయి వర్షాలు

Delhi: 1975 తర్వాత అత్యధిక వర్షపాతం నమోదు * ఢిల్లీలో 1000 మిల్లీమీటర్ల వర్షపాతం * ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Update: 2021-09-11 11:36 GMT

దేశరాజధాని ఢిల్లీలో భారీ వర్షం (ఫోటో: ది హన్స్ ఇండియా )

Heavy Rains in Delhi: భారీ వర్షాలు దేశరాజధాని ఢిల్లీలో దడ పుట్టిస్తున్నాయి. గత కొన్నిరోజులుగా రికార్డుస్థాయిలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, నిన్న ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఏకధాటిగా కురిసిన వానకు రహదారులపైకి నడుము లోతులో నీళ్లు చేరి నదులను తలపిస్తున్నాయి. 1975 తర్వాత అత్యధిక వర్షపాతం ఈ సీజన్‌లోనే నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం వెయ్యి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

మరోవైపు భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. అండర్ పాస్ వంతెన వద్ద నీరు చేరడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఇదే సమయంలో విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో విమాన సర్వీసులు నిలిపివేశారు. మరోపక్క, రాగల 12 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో హస్తిన ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు.

Tags:    

Similar News