Mallikarjun Kharge: AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు
Mallikarjun Kharge: కోర్టులో పిటిషన్ వేసిన హిందూ సురక్షా పరిషత్ నేత హితేష్
Mallikarjun Kharge: AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు
Mallikarjun Kharge: కర్నాటక సీఎం చిక్కుముడి వీడక ముందే AICC చీఫ్ మల్లికార్జున ఖర్గేపై పరువు నష్టం కేసు నమోదయ్యింది. పంజాబ్ సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు జారీ చేసింది. హిందూ సురక్షా పరిషత్ వ్యవస్థాపకుడు హితేష్ భరద్వాజ్ ఖర్గేపై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఖర్గే భజరంగ్‌దళ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని హితేష్ భరద్వాజ్ ఫిర్యాదు చేశారు.