ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం.. కీలక నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్
Delhi Pollution: నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఎత్తివేత
ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం (ఫైల్ ఇమేజ్)
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ కాస్త కంట్రోల్‌లోకి వచ్చిన నేపధ్యంలో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో నిర్మాణాలు, కూల్చివేతపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, దుమ్ము నియంత్రణకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే నోటీసులు లేకుండా పనులు నిలిపివేయడంతో పాటు జరిమానా విధించనున్నట్లు మంత్రి గోపాల్‌రాయ్ హెచ్చరించారు. ఇదే సమయంలో పాఠశాలల పునప్రారంభం, ప్రభుత్వ ఉద్యోగుల వర్క్‌ఫ్రమ్ హోం అంశం, నగరంలోకి ట్రక్కుల ఎంట్రీపై ఉన్న నిషేధంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.