Corona Vaccine: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాక తగ్గుతున్న రోగ నిరోధక శక్తి

Corona Vaccine: 30శాతం మందిలో పడిపోతున్న యాంటీబాడీల సంఖ్య

Update: 2022-01-20 03:00 GMT

కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాక తగ్గుతున్న రోగ నిరోధక శక్తి

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఆరు నెలల నుంచే రోగ నిరోధక శక్తి తగ్గి పోతోందంటున్నారు డాక్టర్లు. 30 శాతం మందిలో యాంటీబాడీల సంఖ్య పడిపోతోందని అధ్యయనంలో తేలిందంటున్నారు. పూర్తిగా రెండు డోసుల టీకాలు వేయించుకున్న వేయి 636 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఈ స్టడీ చేసినట్టు తెలిపారు.

వేయి 636 మందిలో 93శాతం మంది కోవిషీల్డ్‌, 6.2 శాతం మంది కోవాగ్జిన్‌, ఒకశాతం స్పుత్నిక్‌ తీసుకున్నవారు ఉన్నారు. ఈ అధ్యయన ఫలితాలు ఇతర ప్రపంచ అధ్యయనాలతో సరితూగేలా ఉన్నాయి. ఆరు నెలల తర్వాత దాదాపు 30శాతం మంది రక్షిత రోగనిరోధశక్తి స్థాయి వంద కంటే తక్కువస్థాయికి యాంటీబాడీలు తగ్గిపోయినట్టు గుర్తించారు.

వృద్ధుల కంటే యువకుల్లో ఎక్కువ యాంటీబాడీలు ఉంటాయని, వయసు పెరిగినకొద్దీ తక్కువ యాంటీబాడీలు ఉంటాయని వెల్లడించారు. రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న 40 ఏళ్లపై బడినవారిలో ఆరు నెలల తర్వాత యాంటీబాడీలు బాగా తగ్గిపోతున్నాయని.. అలాంటివారిలో కోవిడ్‌ ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలిపారు. వీరికి ఆరు నెలల తర్వాత బూస్టర్‌ డోస్‌ ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఇక ఆరు నెలలు దాటినా తగినంత యాంటీబాడీలు ఉన్నా మిగతా 70శాతం మందికి కూడా 9 నెలల విరామం తర్వాత బూస్టర్‌డోస్‌ ఇవ్వడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని వైద్యులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News