Cyclone Tauktae: తీవ్ర తుఫానుగా తౌక్తా

Cyclone Tauktae: కేరళలోని కన్నూర్‌కి నైరుతీ దిశలో... 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

Update: 2021-05-15 04:31 GMT

Cyclone Tauktae: (File Image)

Cyclone Tauktae: అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన అల్ప పీడ‌నం తుఫాన్‌గా మారి తీరం వైపు దూసుకొస్తున్న‌దని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం తుఫాను అరేబియా సముద్రంలో కొచ్చికి దగ్గరగా ఉండి... గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గుండ్రంగా తిరుగుతోంది. కేరళలోని కన్నూర్‌కి నైరుతీ దిశలో... 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తుఫాన్ తీర ప్రాంత రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రలపై ఎక్కువ‌గా ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉన్న‌ద‌ని తెలిపింది.

ఈ నేప‌థ్యంలో ఆయా రాష్ట్రాల్లో ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆ ఐదు రాష్ట్రాల‌కు స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఎన్డీఆర్ఎఫ్ బ‌ల‌గాల‌ను పంపించింది. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 53 బృందాలను ఐదు రాష్ట్రాల్లో సిద్ధంగా ఉంచిన‌ట్లు ఎన్డీఆర్ఎఫ్ డీజీ సత్యప్రధాన్ ట్వీట్ చేశారు. తౌక్తా తుపాన్ ప్ర‌భావంతో మే 16 నుంచి భారీ వర్షాలు కురువ‌నున్నాయ‌ని ఐఎండీ అధికారులు చెప్పారు.

ప్రస్తుతం వాయవ్య దిశలో కదులుతున్న ఈ తుఫాను మే 18 ఉదయం నాటికి... గుజరాత్ తీరానికి దగ్గర్లో తీరం దాటవచ్చనే అంచనా ఉంది. ఐతే... దీని ప్రభావం డైరెక్టుగా కాకుండా... పరోక్షంగా తెలుగు రాష్ట్రాలపై పడనుంది. తెలంగాణ, ఏపీలో... ఉన్న మేఘాల వల్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. తుఫానుపై అప్రమత్తమైన భారత వాతావరణ శాఖ అరేబియా సముద్రంలోకి ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని కోరింది. తౌక్తా తుపాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబై నగరంలో రెండు రోజుల పాటు కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బంద్ చేయాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు.

Tags:    

Similar News