Cyclone Remal: తీరం దాటిన రెమాల్ తుఫాన్
Cyclone Remal: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ తీరం దాటింది.
Cyclone Remal: తీరం దాటిన రెమాల్ తుఫాన్
Cyclone Remal: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ తీరం దాటింది. అర్థరాత్రి దాటాక బంగ్లాదేశ్, బెంగాల్ సమీపంలో తీరందాటినట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం లక్షా 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
మరోవైపు ఆదివారం మధ్యాహ్నం నుంచే కోల్‌కతా ఎయిర్‌పోర్టు నుంచి సర్వీసులను కూడా నిలిపివేశారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు రంగంలోకి దిగాయి. ఇక తుఫాన్ సన్నద్ధతనపై ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో ప్రాణనష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.