Tamil Nadu: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం

Tamil Nadu: తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో భారీ వర్షాలు

Update: 2023-02-02 09:30 GMT

Tamil Nadu: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం

Cyclone: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు నాగపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో నాగపట్నం, మైలాడుతురై జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. శ్రీలంకలోని బట్టికలోవాకు 60 కిలో మీటర్ల దూరంలో తమిళనాడులోని కరైకల్‌కు 400 కిలో మీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది తీవ్రమై తీరం దాటే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. ఈ ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Tags:    

Similar News