Weather Update: “హమున్” తుఫాన్ గా మారనున్న తీవ్ర వాయుగుండం

Weather Update: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వేగంగా కదులుతున్న వాయుగుండం

Update: 2023-10-24 04:03 GMT

Weather Update: “హమున్” తుఫాన్ గా మారనున్న తీవ్ర వాయుగుండం

Weather Update: నేడు తీవ్ర వాయుగుండం”హమున్” తుఫాన్ గా మారనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 13కిలోమీటర్ల వేగంతో కదులుతూ వాయుగుండం బలపడుతుంది. ఈ వాయుగుండం పారాదీప్ కు దక్షిణంగా 360 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. తుఫాన్ గా మారిన తరువాత “హమున్” దిశ మార్చుకోనుంది. ఉత్తర కోస్తా, ఒడిషా తీరాలను అనుకుని బంగ్లాదేశ్ వైపు పయనించనుంది.

సముద్రంలోనే బలహీనపడి ఈనెల 25న బంగ్లాదేశ్ లోని చిట్టిగాంగ్ సమీపంలో తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. దీంతో తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో మేఘావృతంగా ఉంది. తీవ్ర వాయుగుండం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో చెదురు ముదురు వర్షాలు పడనున్నాయి. అంతేకాకుండా.. కేరళ, తమిళనాడుతో పాటు ఏపీ కోస్తా తీర ప్రాంతంలోనూ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అంతేకాకుండా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

Tags:    

Similar News