CWC Meeting: కాసేపట్లో సీడబ్ల్యూసీ మీటింగ్

CWC Meeting: ఐదు రాష్ట్రాల ఓటమిపై సమీక్ష

Update: 2022-03-13 11:00 GMT

కాసేపట్లో సీడబ్ల్యూసీ మీటింగ్

CWC Meeting: కాసేపట్లో సీడబ్ల్యూసీ మీటింగ్ జరుగనుంది. ఐదు రాష్ట్రాల ఓటమిపై సమీక్షించనున్నారు. అందరి నేతల చూపు రాహుల్‌ గాంధీవైపే ఉంది. , నాయకత్వ మార్పులపై సమావేశంలో ప్రస్తావన తీసుకురానున్నారు. ఎప్పటి నుంచి అసంతృప్తి నేతలు పార్టీ నాయకత్వం మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ సమావేశానికి 25మందితో కూడిన ముఖ్యమైన బాడీ కాకుండా మరో 57మందికి ఆహ్వానం అందించారు. జీ-23 నుంచి ఆనంద్‌శర్మ, గులాం నబీ ఆజాద్, ముకల్‌ వాస్నిక్‌ కు మాత్రం పిలుపు వచ్చింది. పార్టీలో సంస్కరణకు వ్యవస్థాగత మార్పులకు జీ 23 గ్రూప్ పట్టుబుడుతోంది.

సెప్టెంబర్‌లో సంస్థాగత ఎన్నికలు ఉండనున్నాయి. కానీ ముందస్తుగా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని అసంతృప్తి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ రాజీనామాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ రాజీనామా వార్తలను కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ఖండించింది.

CWC మీటింగ్‌ కు మాజీ ప్రధాని మన్మోహింగ్‌ గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంగా ఉండడంతో మన్మోహన్ సింగ్‌ హాజరుకాలేకపోతున్నారు. ఇటు ఏకే అంటోని సైతం గైర్హాజరు అవుతున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News