Gujarat: గుజరాత్‌లో పెళ్లి ఊరేగింపులో నోట్ల వర్షం

Gujarat: మెహసానా జిల్లా కడీ తాలూకాలోని గ్రామంలో నోట్ల వర్షం

Update: 2023-02-19 09:00 GMT

Gujarat: గుజరాత్‌లో పెళ్లి ఊరేగింపులో నోట్ల వర్షం

Gujarat: దేశంలో పెళ్లిళ్లు చాలా ఖరీదై పోయాయి. వస్త్రాలు, నగలపై ఖర్చు ఒక ఎత్తైతే పరవు ప్రతిష్ట కోసం ఖర్చు చేయడం మరో ఎత్తయ్యింది. సరిగ్గా ఇలాంటి పెళ్లే గుజరాత్‌లో జరిగింది. మెహసానా జిల్లా కడీ తాలూకాలోని ఓ గ్రామంలో నోట్ల వర్షం కురిసింది. తన కుమారుని పెళ్లి ఊరేగింపు సందర్భంగా ఇంటి పై నుంచి ఓ వ్యక్తి 500 రూపాయల నోట్లను వెద జల్లుతున్న దృశ్యం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కరెన్సీ నోట్లను అందుకునేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు. గ్రామ మాజీ సర్పంచ్‌ కరీంబాయి మేనల్లుడు రజాక్‌ వివాహంలో నోట్ల వర్షం కురిపించారు. కొన్ని లక్షల రూపాయలు వెదజల్లినట్లు సమాచారం.

Tags:    

Similar News