Third Wave: భారత్‌లో థర్డ్‌వేవ్‌పై సీఎస్ఐఆర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

భారత్‌లో థర్డ్‌వేవ్ ఖాయం అన్న శేఖర్ సి మండే * ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేమన్న మండే

Update: 2021-08-01 12:33 GMT
సిఎస్ఐఆర్ డైరెక్ట జెనరల్ శేఖర్ ముండే (ఫైల్ ఇమేజ్)

Third Wave: భారత్ లో కరోనా వ్యాప్తి మరోసారి పెరుగుతోన్న నేపథ్యంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి మండే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కరోనా థర్డ్ వేవ్ కచ్చితంగా తస్తుందన్నారు. అయితే, అది ఎప్పుడు, ఎలా ప్రారంభమవుతుందన్నది చెప్పలేమని తెలిపారు. థర్డ్ వేవ్ నుంచి రక్షణ పొందడంలో వ్యాక్సినేషన్, మాస్కులు ధరించడం కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. కేరళలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి సేకరించిన డేటాను విశ్లేషిస్తున్నామని తెలిపారు.

ఇక, డెల్టా ప్లస్ వేరియంట్ గురించి ఆందోళన చెందాల్సినదేమీ లేదని డాక్టర్ శేఖర్ సి మండే స్పష్టం చేశారు. డెల్టా వేరియంట్ మాత్రం ప్రమాదకరమైనదని, డెల్టా ప్లస్ వేరియంట్ తో ముప్పు తక్కువేనని ఆయన వివరించారు. ప్రస్తుతం యూకే, తదితర యూరప్ దేశాలు, అమెరికాలో కరోనా మళ్లీ విజృంభిస్తోందని, భారత్ కూడా రక్షణాత్మక వైఖరి అవలంబించాల్సి ఉంటుందని సూచించారు. భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ వస్తే అది కొత్త వేరియంట్ కారణంగానే వ్యాపిస్తుందని వెల్లడించారు.

Tags:    

Similar News