కాశ్మీర్ లో 'ఉగ్ర' అలజడి.. సీఆర్పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు అలజడి సృష్టించారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో పెట్రోలింగ్ పార్టీ వాహనంపై ఉగ్రవాది గ్రెనేడ్ విసిరారు.

Update: 2020-04-08 01:56 GMT
Representational image

కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు అలజడి సృష్టించారు. దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో పెట్రోలింగ్ పార్టీ వాహనంపై ఉగ్రవాది గ్రెనేడ్ విసిరారు.. దాంతో సిఆర్‌పిఎఫ్ హెడ్‌ కానిస్టేబుల్‌ మంగళవారం మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం బీజ్‌బెహారాలో జరిగిన సంఘటనలో హెడ్ కానిస్టేబుల్ శివాల్ లాల్ నీతం మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. ఉగ్రవాదులు సిఆర్‌పిఎఫ్ పెట్రోలింగ్ పార్టీపై గ్రెనేడ్ విసిరి పారిపోయారని అధికారులు తెలిపారు.

దీంతో జవాన్లకు చీలిక గాయాలు అయ్యాయి.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు, అయితే అక్కడ చికిత్స పొందుతూ శివాల్ లాల్ నీతం చనిపోయినట్లు ప్రకటించారు. మరోవైపు గ్రెనేడ్ విసిరిన ఉగ్రమూకలు తప్పించుకున్నారు. దాంతో ప్రతీకారం తీర్చుకునేందుకు భారత జవాన్లు వ్యూహాలు రచిస్తున్నారు.

ఇదిలావుంటే మృతి చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. ఆయన గత కొన్నేళ్లుగా సిఆర్‌పిఎఫ్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉగ్రమూకలు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయారని తోటి జవాన్లు అన్నారు.



Tags:    

Similar News