Yashpal Sharma: మాజీ క్రికెటర్‌ యశ్‌పాల్ శర్మ కన్నుమూత

Yashpal Sharma: గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన యశ్‌పాల్‌ * 1978లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం

Update: 2021-07-13 08:04 GMT

మాజీ క్రికెటర్ యాశ్పాల్ శర్మ (ఫోటో : హిందుస్థాన్ టైమ్స్)

Yashpal Sharma: మాజీ క్రికెటర్‌ యశ్‌పాల్‌ శర్మ కన్నుమూశారు. ఉదయం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. 1954 ఆగస్టున పంజాబ్‌లో జన్మించిన యశ్‌పాల్ శర్మ.. 1978లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశారు. 1983 వరకు టీమిండియాలో కొనసాగారు. 1983 వరల్డ్‌కప్‌లో టీమ్‌ ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించారు యశ్‌పాల్‌ శర్మ. సెమీస్‌లో 61 పరుగులతో టాప్‌స్కోరర్‌గా టీమ్‌కు విజయాన్ని అందించారు. టోర్నీలో ఇండియా తరపున అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచారు. తన ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో టీమిండియా తరపున 37 టెస్టులు ఆడిన యశ్‌పాల్ 16 వందల 6 రన్స్ చేయగా.. 42 వన్డేల్లో 883 పరుగులు చేశాడు.

Tags:    

Similar News