ఉత్తరప్రదేశ్‌లో పెరిగిన కరోనా కేసులు, మరణాలు

గత 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లో 382 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 11 మంది రోగులు కూడా మరణించారు.

Update: 2020-06-07 06:58 GMT

గత 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లో 382 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 11 మంది రోగులు కూడా మరణించారు. కొత్త కేసులు రావడంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 10,103 కు చేరుకోగా, ఇప్పటివరకు 268 మంది ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారు. డిశ్చార్జ్ లు పోను ప్రస్తుతం రాష్ట్రంలో 3927 మంది రోగులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 3,55,085 నమూనాలను పరీక్షించారు.

వీటిలో 3,42,360 పరీక్ష నివేదికలు ప్రతికూలంగా ఉన్నాయని, 10103 పాజిటివ్‌గా ఉన్నాయని తేలింది, 2622 నమూనాల నివేదికల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. కాగా ఈ 382 కొత్త కేసులు కాన్పూర్‌లో 32, భడోహిలో 28, ఘజియాబాద్‌లో 19, జౌన్‌పూర్‌లో 18, నోయిడాలో 15, అమేథిలో 13, హపూర్, మెయిన్‌పురి, ఆగ్రాలో 12, ఎటావాలో 11, కుషినగర్‌లో 10, మీరట్, ఫిరోజాబాద్, కాన్పూర్ దేహాట్‌లో 9. ,బల్లియా, జలాల్, ఝాన్సీ, ఎటా, కాస్గంజ్, హమర్పూర్లలో ఒక్కో కేసు నమోదయింది.

Tags:    

Similar News