Covid Vaccines: కొవిడ్ టీకాలపై తప్పుడు ప్రచారం ఆపండి.. ఆకస్మిక మరణాలకు వ్యాక్సిన్ కారణం కాదంట!

Covid Vaccines: కరోనా మహమ్మారి తర్వాత దేశవ్యాప్తంగా ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతోంది.

Update: 2025-07-02 05:35 GMT

Covid Vaccines: కొవిడ్ టీకాలపై తప్పుడు ప్రచారం ఆపండి.. ఆకస్మిక మరణాలకు వ్యాక్సిన్ కారణం కాదంట!

Covid Vaccines: కరోనా మహమ్మారి తర్వాత దేశవ్యాప్తంగా ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేకంగా 40 ఏళ్ల లోపు వారు కార్డియాక్ అరెస్ట్‌ కారణంగా చనిపోతుండటం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్‌, ఎయిమ్స్‌, ఎన్‌సీడీసీ సంస్థలు కలిసి దీనిపై విస్తృతంగా అధ్యయనం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించాయి.

ఈ అధ్యయనాల్లో కోవిడ్ వ్యాక్సిన్లతో ఆకస్మిక మరణాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు మాత్రమే ఎక్కువగా ఆకస్మిక మరణాలకు కారణమని తేలింది.

2023 మే నుంచి ఆగస్టు వరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిపిన సర్వేలో, 2021 అక్టోబర్‌ నుంచి 2023 మార్చి మధ్య ఆకస్మికంగా చనిపోయిన 18-45 ఏళ్ల వయసువారి వివరాలు సేకరించారు. వాటిని విశ్లేషించగా — టీకాల వల్ల మరణించారని తేలిన ఘటన ఏదీ లేదని ఐసీఎంఆర్‌, ఎయిమ్స్‌ అధికారికంగా ప్రకటించాయి.

అధిక సంఖ్యలో టీకాలు వేసినప్పటికీ, తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా అరుదుగా నమోదైనట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ‘‘కోవిడ్ వ్యాక్సిన్లు భారత్‌లో సురక్షితమైనవే. టీకాలపై నమ్మకాన్ని దెబ్బతీసే అసత్య ప్రచారాలు తగ్గించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి, కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ టీకాల వల్లే లక్షల మందికి ప్రాణాలు నిలిచాయని గుర్తించాలి’’ అని సంస్థలు పిలుపునిచ్చాయి.

ఈ అధ్యయనం ద్వారా కోవిడ్ టీకాలు ఆకస్మిక మరణాలకు కారణం అన్న అభిప్రాయం తప్పుబడినట్టు స్పష్టమైంది. ప్రజలు టీకాలపై ధైర్యంగా నమ్మకంతో ముందుకు వెళ్లాలని, ఆరోగ్యానికి సంబంధించిన పుకార్లను వ్యాప్తి చేయకుండా జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News