Corona Patient: కరోనా వార్డులో సైతం అత్యాచారయత్నం

Corona Patient: కోవిడ్ వార్డులో కోవిడ్ పేషెంటుగా ఉండి.. మరో కోవిడ్ పేషెంట్ మీద అత్యాచారయత్నం చేశాడు

Update: 2021-05-03 06:18 GMT

Representational Image

Corona Patient: ఊరందరిదీ ఒక బాధ అయితే.. ఆడికి మాత్రం వేరే బాధ. ప్రాణాలు పోతున్నాయనే టెన్షన్ ఒకవైపు ఉంటే.. వాడికి మాత్రం వేరే ఆలోచన వచ్చింది. కక్కుర్తి పీక్స్ కి వెళ్లటమంటే ఇదే అనుకోవాలి. అంత వెధవ అని నిరూపించుకున్నాడు. కోవిడ్ వార్డులో కోవిడ్ పేషెంటుగా ఉండి.. మరో కోవిడ్ పేషెంట్ మీద అత్యాచారం చేయాలని చూశాడు. వినటానికే షాకింగ్ గా ఉన్న ఈ ఘోరం ఒడిశాలోని న్యూపాద జిల్లాలో జరిగింది.

ఏప్రిల్ 26. ఎండ బాగా పెరిగింది. రద్దీ అంతగా లేని ఆస్పత్రి అది. అక్కడ ఓ మహిళను కరోనా సోకిందని జాయిన్ చేశారు. ఆమెను ఓ వార్డులోకి తీసుకెళ్తుంటే. మిగతా పేషెంట్లు అలా దీనంగా చూడసాగారు. రెండు కళ్లు మాత్రం మరోలా చూశాయి. సినిమాల్లో విలన్ చూపుల్లా ఉన్నాయి అవి. ఆ కళ్లతో సైలెంట్‌గా చూసిన ఆ వ్యక్తికి ఆల్రెడీ కరోనా ఉంది. ఆమె కంటే ముందే ఆస్పత్రిలో చేరాడు. అంతలో ఆమె..ఏదో పనిమీద వేరే గదిలోకి వెళ్లింది. అతను కూడా ఆమె వెంట వెళ్లాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద కేకలు వినిపించేసరికి..మిగతా పేషెంట్లు లేని ఓపికను తెచ్చుకొని మరీ ఆ గది దగ్గరకు వెళ్లారు. ఆమె కళ్ల వెంట కన్నీళ్లు. ఏడుస్తూనే విషయం చెప్పింది. పేషెంట్లు, డాక్టర్లు అతన్ని చితకబాదారు.

ఆమెను ఓ చోట జాగ్రత్తగా ఉంచి అతన్ని మరో చోట ఉంచి పోలీసులకు కాల్ చేశారు. ఓ లేడీ తహసీల్దారు బాధితురాలి దగ్గరకు వచ్చి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. "అతను ఆ గదిలోకి వచ్చాడు. నేను ఎందుకొచ్చాడో అనుకున్నాను. నా దగ్గరకు వచ్చి మర్మాయవాలపై చెయ్యి వేశాడు. అంతే నాకు డౌట్ వచ్చి గట్టిగా కేకలు వేశాను" అని బాధితురాలు చెప్పింది.

విషయం తెలుసుకున్న న్యూపాద పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సంజుక్త బర్లా అతనిపై ఐపీసీ సెక్షన్ 354 (మహిళపై బలవంతపు దాడి), సెక్షన్ 354 (ఎ), సెక్షన్ 269, సెక్షన్ 270 కింద కేసు బుక్ చేసినట్లు తెలిపారు. "మామూలు వ్యక్తులైతే వెంటనే అరెస్టు చేసేవాళ్లం. కానీ అతను కరోనా పేషెంట్ కాబట్టి అతనికి కరోనా నెగెటివ్ రావాల్సి ఉంది. నెగెటివ్ రాగానే పట్టుకుపోతాం. అలాగని అతన్ని ఇక్కడే ఉంచం. అతన్ని పాలిటెక్నిక్ ట్యూన్డ్ కోవిడ్ ఆస్పత్రికి తరలిస్తాం" అని పోలీసులు తెలిపారు. ఇంకా ఎన్నిఘటనలు చూడాల్సి వస్తుందోనని సదరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News