CoWin App: కోవిడ్ -19 టీకా కోసం నమోదు చేసుకోండిలా..

CoWin App: కోవిడ్ -19 టీకా ప్రక్రియ ఇండియాలో గత నెలలో ప్రారంభమైందనే విషయం తెలిసిందే.

Update: 2021-03-01 10:23 GMT

కోవిన్ యాప్ (ఫోటో హన్స్ ఇండియా)

CoWin App: కరోనా వైరస్ బారిన పడకుండా కోవిడ్ -19 టీకా ప్రక్రియ ఇండియాలో గత నెలలో ప్రారంభమైందనే విషయం తెలిసిందే. కేవలం ఫ్రంట్ లైన్ వర్కర్స్ కే మొదట ఈ టీకాను అందించారు. ప్రస్తుతం 60 ఏళ్ల పైబడిన వారితోపాటు దీర్ఘకాలం వ్యాధులతో బాధపడే వారికి టీకా అందించాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కోవిన్ యాప్ (CoWin App) లో నమోదు చేసుకున్నవారికి మాత్రమే టీకా అందించనున్నట్లు వెల్లడించారు. మరి కోవిన్ యాప్ లో ఏలా రిజిస్టర్ చేసుకోవాలి, టీకా కోసం అపాయింట్ మెంట్ ను ఎలా బుక్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..


కోవిన్ యాప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి: (How to Register in the CoWin Application)

  1. మొదటగా కోవిన్ యాప్ (CoWin App) ను ప్లే స్టోర్ లేదా ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
  2. తరువాత మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, మొబైల్ నంబర్ ను వెరిఫై చేసుకోవాలి.
  3. మొబైల్ నంబర్ వెరిఫై చేసుకున్నాక, 'Registration of Vaccination' పేజ్ ఓపెన్ అవుతుంది.
  4. రిజిస్ట్రేషన్ పేజీలో అడిగిన డిటేల్స్ అన్ని ఎంటర్ చేయాలి. అనంతరం ఒక్కొకరి డిటైల్స్ ఎంటర్ చేయాలి. ఇలా అన్ని వివరాలు అందించాక రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే. అనంతరం '
    Account Details
    ' పేజీ ఓపెన్ అవుతుంది.
  5. ఈ పేజీలో 'Photo ID Proof'లేదా 'Photo ID Number'వివరాలు అందించి వ్యక్తిగత వివరాలు Confirm చేసుకోవాలి.

టీకా కోసం అపాయింట్ మెంట్ బుకింగ్: (How To Book Appointment For Vaccination)


  • డాష్ బోర్డ్‌లోని క్యాలెండర్ బటన్ క్లిక్ చేసి 'Booking Appointment for Vaccination' లేదా 'Schedule Appointment' క్లిక్ చేయాలి.
  • ఈపేజీలో వ్యాక్సినేషన్ సెంటర్ ను ఎంచుకుని, రాష్ట్రం, జిల్లా, బ్లాక్, పిన్ కోడ్ లాంటి వివరాలు అందించాలి.
  • అనంతరం వివరాలను ఓసారి చెక్ చేసుకుని Confirm చేస్తే.. సెంటర్ వివరాలు, అపాయింట్‌మెంట్ తేది మీ మొబైల్ నంబర్ కి మెసేజ్ వస్తుంది.
  • అపాయింట్‌మెంట్ లో ఏదైనా మార్పు చేసుకోవాలంటే, రీ షెడ్యూల్డ్ కూడా చేసుకోవచ్చు.
Tags:    

Similar News